నా కలర్‌ఫొటోకు విలన్‌ సునీల్‌

కమెడియన్‌గానే కాదు, హీరోగానూ పలు చిత్రాల్లో మెప్పించాడు సునీల్‌. ఎప్పుడూ ఎవరికీ ఏ హానీ తలపెట్టని సునీల్‌ను పట్టుకుని విలన్‌ అంటున్నాడు ఓ దర్శకుడు. తన కలర్‌ ఫొటోకు సునీలే అసలైన విలన్‌ అని పేర్కొంటున్నాడు. మరేమీ లేదు, నేడు సునిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘క‌ల‌ర్‌ ఫోటో’ సినిమాలో సునీల్‌ లుక్‌ను విడుద‌ల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనిపై సునీల్ మాట్లాడుతూ.. ‘క‌ల‌ర్ ఫోటోలో రామ‌రాజుగా క‌నిపిస్తున్నాను. నా కెరీర్‌లో బెస్ట్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. అలాగే నా పాత్ర‌లో వున్న కొత్త‌దన‌మే అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. ఇలాంటి పాత్ర‌ల‌తో నా ఫ్యాన్స్‌ను అల‌రిస్తాన’ని పేర్కొన్నారు. ('కలర్‌ ఫోటో'తో విలన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న సునీల్)



‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ లాంటి స్పూఫ్‌ కామెడీలతో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ కొట్టిన అమృత ప్రొడక్షన్స్‌.. లౌఖ్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కలర్‌ ఫొటో’. మజిలీ, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, ప్రతిరోజు పండగ చిత్రాల్లో హస్య నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సుహాస్‌ తొలిసారి హీరో అవతారం ఎత్తాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. యూట్యూబ్‌ వీడియోల ద్వారా పాపులర్‌ అయిన సందీప్‌రాజ్‌ తొలిసారిగా దర్శకుడి బాధ్యతలు ఎత్తుకున్నాడు(కానీ కథ మాత్రం ఇతనిది కాదు). ‘మత్తు వదలరా’ చిత్రంతో విజయాన్ని అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణి అబ్బాయి కాల భైరవ స్వరాలు సమకూర్చాడు.(దళపతితో రొమాన్స్‌ చేయనున్న పూజాహెగ్డే !)