అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీలను 35 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారని నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం బీసీలను వాడుకుని వదిలేశారని చంద్రబాబుపై మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలో మంత్రి మాట్లాడుతూ.. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు నైజమని వ్యాఖ్యానించారు. కుళ్లు, కుతంత్రాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీ కమిషన్ వేస్తానని మోసం చేశారని పేర్కొన్నారు. (చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం..)
చంద్రబాబు గుంట నక్కలా మాట్లాడుతున్నారు